![]() |
![]() |

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ కి ఇద్దరు ఘనాపాఠీలు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా స్టేజి దగ్గరకు కార్ లో వచ్చి డోర్ తీసుకుని అలా స్టేజి మీదకు నడిచొచ్చారు. "ఎండా కాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళదాం అనుకున్నా ఇక్కడికి వచ్చేసారు" అంటూ మంచు లక్ష్మిని చూపించింది రోజా. "పోటీలో ఎవరైనా కంచుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను..మీరు కలిశారు" అని మంచు లక్ష్మి రోజా మీద సెటైర్ వేసింది. తర్వాత ఇద్దరూ షాక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తర్వాత ఇద్దరితో రవి కొంచెం టఫ్ గేమ్స్ ఆడించాడు. స్టేజి మీద బోరింగ్ పంప్ పెట్టించి నీళ్లు కొట్టించాడు ఇద్దరి చేతా. "నాకు మంచు లక్ష్మికి పోటీ పెట్టారు.
మరి మంచు లక్ష్మి కోసం రవి వెళ్లి నీళ్లు కొడితే ఏంటి అర్ధం" అని అడిగింది రోజా. "ఒకసారి చూడండి నా బిందెలో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి" అంది మంచు లక్ష్మి. "రవి ఇప్పుడు హ్యాపీనా..ఇద్దరి ఆడవాళ్ళ మధ్య బిందెల ఫైట్ పెట్టావ్ గా" అంటూ సెటైర్ వేసింది అష్షు. ఇక బుల్లితెర మీద మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేసింది. కానీ ఈ షోకి ఆమె రావడం అదనపు ఆకర్షణే అని చెప్పొచ్చు. ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో 16 జంటలు పోటీ పడ్డాయి. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. నెమ్మదిగా షోస్ అన్నీ కూడా పూర్తైపోవచ్చాయి...చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఐపోయింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 కూడా పూర్తి కావొచ్చింది. ఇప్పుడు సూపర్ సీరియల్ కూడా గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది అంటే దాదాపు పూర్తైపోతున్నట్టే. ఇలా కొన్ని షోస్ ఇప్పుడు ఎడ్జ్ కి వచ్చేసాయి. ఈ షో గ్రాండ్ ఫైనల్ కోసం మంచు లక్ష్మిని, రోజాని గెస్టులుగా ఇన్వైట్ చేశారు.
![]() |
![]() |